Minister Appalaraju comments on Chandrababu : సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: మంత్రి సీదిరి అప్పలరాజు - Chandra Babu Pawan Kalyan
🎬 Watch Now: Feature Video
Minister Appalaraju comments on Chandrababu : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హతలేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటనపై నిప్పులు చెరిగిన మంత్రి.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఒకేసారి దత్తపుత్రుడుతో కలిసి ఎందుకు పర్యటన చేస్తున్నారో చెప్పాలని మంత్రి సీదిరి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ జెండా.. చంద్రబాబు అజెండేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కేసు పెడితే తప్పు ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరంతో సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఇవే చివరి ఎన్నికలు. రాష్ట్రంలో వ్యవస్థలు చెడిపోవటానికి వారిద్దరే కారణం. పుంగనూరు ఘటనకు కారకుడైన చంద్రబాబునాయుడిపై ఎందుకు కేసు పెట్టకూడదు. ఆయన ఏమైనా పై నుంచి ఊడిపడ్డారా..? టీడీపీ హయాంలో రూ.5.08కు విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే రూ.2కే యూనిట్ విద్యుత్తు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది'అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.