Minister Amarnath Visit Bobbili Industrial Area: ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల మూత వెనుక చాలా కారణాలు: మంత్రి అమర్నాథ్ - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Minister Amarnath Bobbili Industrial Area Visit: విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పారిశ్రామిక వాడను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తొలిసారి సందర్శించారు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసినంత భూములు సిద్ధంగా ఉన్నప్పటికీ కంపెనీలు ఎందుకు రావడం లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బొబ్బిలి పరిశ్రామికవాడలో ఇంకా ఎన్ని ఎకరాల భూమి ఖాళీగా ఉంది అనే విషయంపై కూడా ఆయన ఆరా తీశారు. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు తీసుకుని ఇంతవరకు ఆ ప్రదేశాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయాని వాటి పరిస్థితి గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొబ్బిలి పారిశ్రామికవాడను అభివృద్ధి చేసేందుకు కావల్సిన ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల మూత వెనుక చాలా కారణాలు ఉన్నాయని మంత్రి అన్నారు. వారికి లాభాలు వచ్చినప్పుడు విద్యుత్తు చార్జీలు పెంచలేదని, నష్టాలు వచ్చినప్పుడు తగ్గించలేదని ఆయన తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే సమన్వయంతో ముందుకు వెళ్లాలని మంత్రి అన్నారు.