'పోలీసులతో నేను మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే'-కంచికచర్ల ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ - Minister Adimulapu Suresh news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 8:01 PM IST

Minister Adimulapu Suresh Reacted Kanchikacharla Incident: ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో అగ్రకులానికి చెందిన కొంతమంది యువకులు.. దళిత యువకుడైన శ్యామ్‌పై దాడి చేసి, అమానుషంగా ప్రవర్తించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ కేసులో తాను జోక్యం చేసుకున్నానన్న ఆరోపణల్ని ఖండిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కంచికచర్ల పోలీసులతో తాను మాట్లాడినట్టు నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమేనని మంత్రి సవాల్ చేశారు.

Minister Adimulapu Suresh Comments: తాజాగా పాత గొడవల కారణంగా అగ్రకులానికి చెందిన కొంతమంది యువకులు.. కంచికచర్లకు చెెందిన దళిత యువకుడిని కారులో తీసుకెళ్లి, నాలుగు గంటలపాటు నరకం చూపించారు. మంచినీళ్లు అడిగితే రహదారి మధ్యలో కారు ఆపి మూత్రం పోసి అవహేళన చేస్తూ.. అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తూ..''దళిత యువకుడి శ్యామ్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి.. నాపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నాను. కంచికచర్ల పోలీసులతో నేను మాట్లాడినట్టు నిరూపిస్తే.. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించారు. దాడి ఘటనలో పార్టీల ప్రస్తావన ముఖ్యం కాదు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. తెలుగుదేశం ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోంది.'' అని మంత్రి సురేష్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.