భాస్కరరెడ్డి అరెస్ట్‌పై ఆదిమూలపు సురేశ్ కీలక వ్యాఖ్యలు.. - మంత్రి ఆదిమూలపు సురేశ్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Adimulapu Suresh comments on Bhaskara Reddy arrest: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిములపు సురేశ్ అన్నారు. ఈ విషయంపై మంత్రి సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయాలని, అసలైన దోషులను గుర్తించాలని అన్నారు. దీంతోపాటు వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించామని కోరింది సీఎం జగనే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో చట్టం తన పని తాను సక్రమంగా చేసుకుంటుంది అని భావిస్తున్నానని కూడా ఆయన తెలిపారు. అయితే ఆ కాసేపటికే తన మాటల్ని మీడియాలో వక్రీకరించడం జరిగిందని ఆయన మాట మార్చారు. కాగా ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుంటుంది అని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన వివరణ ఇస్తూ వీడియో ప్రకటన విడుదల చేశారు.