Teachers meeting with Botsa: మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల భేటీ.. మేలు జరగకపోతే ఉద్యమం చేపడతాం - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 6, 2023, 10:56 AM IST

Interview with teacher unions leaders: క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలు, క్రమశిక్షణ చర్యలు ఇబ్బందికరంగా ఉంటున్నాయని.. ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వేలాదిగానే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటున్నా.. వందల్లో మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటిస్తుండడం వల్ల ఉన్న ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోందని పెదవి విరుస్తున్నాయి. అనేక సమస్యలను నివేదిస్తున్నా.. అరకొరగానే స్పందన వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యా ప్రమాణాలను పెంచాలంటూ ఆదేశిస్తున్నా.. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏకోపాధ్యాయ పోస్టుల్లో రాష్ట్రం ముందు వరుసలో ఉండడంపై తగిన నిర్ణయాలు తీసుకోకపోవడంపై ఆందోళనగా ఉన్నాయి. వేసవి సెలవులు ముగిసేలోగానే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామంటూ అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమై హామీ ఇచ్చారు. యాప్‌ల భారాన్ని తగ్గిస్తామని చెబుతున్నా వాటి అమలుపై సందేహం వెలిబుస్తోన్న వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.