YCP Leaders Harassments: వైఎస్సార్సీపీ నేత వేధింపులు తాళలేక.. వ్యాపారి ఆత్మహత్య - వ్యాపారి ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
Man Suicide Due to YSRCP Leader Harassments: అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్కాపురంలో బొమ్మిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోగులదిన్నే గ్రామానికి చెందిన నర్సారెడ్డి, శంకర్ రెడ్డికి మర్రిచెట్లపాలెంలో నిర్మిస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీ విషయంలో వ్యాపార లావాదేవీలున్నాయి. నర్సారెడ్డి అతని కుమారులు రెండు కోట్లరూపాయలు ఇవ్వకుండా తనను మోసం చేశారని బాధితుడు ముందుగానే ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నర్సారెడ్డిని ప్రశ్నించిన తనను పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు లేఖలో తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో నర్సారెడ్డి అతని కుమారులు తమ కుటుంబాన్ని తీవ్రంగా మోసం చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.