Lokesh Meeting With Aqua Farmers in Undi Constituency: 'జగన్ లో ఓల్టేజ్..' అందుకే కరెంటు కోతలు.. ఆక్వా రైతుల సమావేశంలో లోకేశ్ - ఆక్వా రైతులతో లోకేశ్ సమావేశం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-09-2023/640-480-19430200-thumbnail-16x9-lokesh-meeting-with-aqua-farmers-in-undi-constituency.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 8:26 PM IST
Lokesh Meeting With Aqua Farmers in Undi Constituency: జగనోరా వైరస్ దెబ్బకు పరిశ్రమలు బాధితులుగా మారాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర 204 రోజు.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆక్వా రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. విద్యుత్ కోతలు, సబ్సిడీ రాయితీలను రద్దు చేసి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆక్వా రైతులు లోకేశ్‌కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని వాపోయారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆక్వా, నాన్ ఆక్వా జోన్ అని తేడా లేకుండా రైతులకు యూనిట్‌ని రూపాయిన్నరకే ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
రైతులను మోసం చేస్తున్నవారిని టీడీపీ వదిలిపెట్టదని హెచ్చరించారు. చేపల రైతులకు అవసరమైన విధివిధానాలపై చర్చిస్తామన్న లోకేశ్.. చేపల రైతుల కోసం మెరుగైన విధానం తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు హై ఓల్టేజ్... అందుకే నాణ్యమైన కరెంట్ ఇచ్చారని.. జగన్ లో ఓల్టేజ్ కాబట్టే కరెంట్ కోతలు ఉంటున్నాయని లోకేశ్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో నేడు లోకేశ్ 13 కిలోమీటర్లు నడవగా.. భీమవరం శివారు నరసింహాపురం విడిది కేంద్రానికి చేరుకున్నారు.