Judicial Employees: 'ప్రభుత్వం నుంచి మాకెలాంటి సహకారం అందడం లేదు' - Kurnool District top news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 28, 2023, 7:28 PM IST

Judicial Employees Association fire on AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహకారం అందడం లేదని.. జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి హైకోర్టు నుంచి ఎనిమిది నుంచి పది ప్రతిపాదనలు పంపితే.. ఇప్పటివరకూ ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో అక్కడి గవర్నమెంట్ అన్ని ప్రతిపాదనలను అమలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. 

హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు కృతజ్ఞతలు.. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో ఈరోజు జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ మిశ్రా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో 4,500 ఉద్యోగాలను భర్తీ చేసి, నేడు వారికి అపాయిమెంట్ లెటర్స్ ఇచ్చినందుకు తమ అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 

వైసీపీ సర్కార్  గందరగోళం సృష్టిస్తోంది... అనంతరం ఉమ్మడి హైకోర్టు నుంచి ఎనిమిది నుంచి పది ప్రతిపాదనలు పంపితే..ఇప్పటివరకూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ గవర్నమెంట్ అన్ని ప్రతిపాదనలను అమలు చేసిందన్న ఎంప్లాయిస్..  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. న్యాయమూర్తులకు సంబంధించిన జీతాల విషయంలో కూడా జీవోలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉమ్మడి హైకోర్టు ప్రతిపాదించిన ప్రతిపాదనలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.