Achyutapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో భూ నిర్వాసితుల ఆందోళన.. - అనకాపల్లి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Land Dwellers Protest at Achyutapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో కామత్‌గిరి స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని.. భూ నిర్వాసితులు ముట్టడించారు. కంపెనీలో 210 మంది ఇతర రాష్టాలవారికి ఉపాధి కల్పించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములు తీసుకునేటప్పుడు నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన కంపెనీ.. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందినవారిని పనిలోకి తీసుకోవటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ ప్రకటించిన 75 శాతం రిజర్వేషన్ అమలు చేసి తమకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కంపెనీలో విధులకు వెళ్లకుండా కార్మికులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు.
"కంపెనీ యాజమాన్యం ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామనే హామీతో మా నుంచి భూములు తీసుకుంది. అయితే ఈ కంపెనీ యాజమాన్యం మొదటి నుంచీ కూడా నిర్వాసితుల పట్ల చాలా ఉదాసీన వైఖరితో ముందుకు నడుస్తోంది. మేము చాలా సార్లు మాకు ఉపాధి కల్పించమని అడిగాము. అయితే కంపెనీ యాజమాన్యం నుంచి దీనిపై ఎటువంటి స్పందన లేదు. దీంతో యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకుందామనే ఉద్దేశంతో మేము ఈ రోజు నిరసనలు చేపట్టాము." - భూ నిర్వాసితులు