kurnool Police Arrest Bikes Robbery Gang : బైకులను దొంగలిస్తున్న ముఠా అరెస్టు.. 13 లక్షల విలువైన బైకులు స్వాధీనం
🎬 Watch Now: Feature Video
kurnool Police Arrest Bikes Robbery Gang: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 13 లక్షల 55 వేలు విలువ చేసే 13 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శంకరయ్య మాట్లాడతూ.. జిల్లాలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య కాలంలో ఏడు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ నేపథ్యంలో డీఎస్పీ అధ్వర్యంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. శుక్రవారం ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముఠాను పట్టుకున్నాం. నంద్యాలకు చెందిన ఐదుగురి దగ్గర నుంచి మొత్తం 13 బైకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముందుగా వారి దగ్గర నుంచి ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నాం. తరవాత వారిని విచారించగా మరో ఎనిమిది బైకుల ఉన్నట్లు తెలిసింది. ఆ వాహనాలలో కర్నూల్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఏడు బైకులు, మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఒకటి, ఒంగోలు రూరల్ ఒకటి, కనిగిరి రెండు ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్వి రెండు మొత్తం 13 బైకులు ఉన్నాయి. నంద్యాలకు చెందిన షేక్ మహబూబ్ బాషా, వెంకట సాయి కౌశిక్ మీరుతోపాటు మరో ముగ్గురు మైనర్లు ఈ చోరీలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్కు తరలించారని సీఐ తెలిపారు.