వైభవంగా పోలేరమ్మ తిరునాళ్లు.. భారీగా తరలివచ్చిన భక్తులు - కొండపాటూరు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
KONDAPATURU POLERAMMA TIRUNALLU: గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో పోలేరమ్మ తల్లి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారిని వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున భక్తులు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఈ ఉత్సవానికి తరలివచ్చారు. దీంతో గ్రామమంతా జనసంద్రంగా మారింది. భక్తులు మేళతాళాలు, వాద్యాల నడుమ నృత్యాలు చేస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పూలతో అలంకరించిన ట్రాక్టర్లతో ప్రదర్శనగా గ్రామంలోని ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం.. సిరిమాను మహోత్సవం కోలాహలంగా సాగింది. సిరిమానుకు ఉన్న ఊచల బోనులో మేకపోతును ఉంచారు. భక్తులు ఆ మేకపోతుపైకి జీడికాయలు విసిరి తమ కోర్కెలు చెప్పుకున్నారు. తిరునాళ్లకు హాజరైన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు పోలీసు అధికారులు కూడా ఆలయ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.