Konaseema Tirumala in vaadapally : కోనసీమ తిరుపతి వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం... - ఆంధ్రుప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 2:04 PM IST
Konaseema Tirumala in Vaadapally : కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఏడు శనివారాల నోము నోచుకునేందుకు భక్తులు స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది. దీంతో స్వామి దర్శనానికి సుమారుగా మూడు గంటల సమయం పడుతోందని అన్నారు. స్వామివారికి వేదమంత్రాలతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
Special Poojalu in Venkateshwara Swamy Temple : ఏడు శనివారాలు వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసి, ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. శనివారాలు భక్తి శ్రద్దలతో స్వామివారిని కొలుస్తారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలో భక్త జన సందోహం అధికంగా ఉంటుంది. భగవంతుని నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ తెలిపారు.