Katrapadu Sarpanch Cycle Yatra for Panchayat Funds: పంచాయతీ నిధుల కోసం సర్పంచ్ వినూత్న నిరసన - AP Latest News
🎬 Watch Now: Feature Video
Katrapadu Sarpanch Cycle Yatra for Panchayat Funds: గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటుగా.. పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయాన్ని లాక్కోవటం వంటి పనులు అయితే చేస్తుంది కానీ వాటి అభివృద్ధి కోసం పైసా కూడా ఇవ్వటం లేదు. ఈ పంచాయతీల నిధుల దారి మళ్లింపుపై.. సర్పంచ్‌లు నెలల తరబడి పోరాడుతూనే ఉన్నారు. దిల్లీలో కూడా తమ నిరసన గళం వినిపించినా ఎలాంటి ప్రయోజనం లేదు. సర్పంచ్ల సమస్యలపై ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గ్రామాల్లోని పంయతీలకు ఒక్క పైసా కూడా విడుదల కాక పారిశుద్ధ్య పనులు పడకేసింది. కనీస పనులు కూడా చేయించలేక.. గెలిపించిన ప్రజలకు సర్పంచ్‌లు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా.. గుంటూరు జిల్లా కాట్రపాడుకు చెందిన సర్పంచ్ శివశంకర్ ఉద్యమబాట పట్టారు. నిధులు విడుదల చేయాలంటూ వినూత్న రీతిలో సైకిల్‌కు ప్లకార్టులు కట్టి విధుల్లో సైకిల్ తొక్కుతూ యాత్ర చేపట్టారు.
TAGGED:
గ్రామ పంచాయతీల నిధులు