Kapu Leaders Agitation in Amaravati: అమరావతిలో కాపు సంఘాల అందోళన.. అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత - మేకల వెంకట్‌పై చర్యలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/640-480-19160722-364-19160722-1690965983774.jpg)
Kapu Leaders Agitation in Amaravati: కాపు సంఘాలు చేపట్టిన అందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో పోలీసులకు కాపు సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కాపు కులాన్ని దూషించిన మేకల వెంకట్‌పై చర్యలు తీసుకోవాలంటూ అమరావతిలో కాపు సంఘాలు ఆందోళన చేపట్టాయి. నాలుగు రోజుల క్రితం వెంకట్‌పై పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని.. బుధవారం కాపు సంఘాలు ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఆ కార్యక్రమంలో భాగంగా కాపు నేతలు రంగా విగ్రహం వద్దకు చేరుకున్నారు. కాపు సంఘాల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవటంతో.. పోలీసులకు కాపు నేతలకు మధ్య తోపులాట తలెత్తింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో.. కాపు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాపు నేతలు ధర్నాకు దిగారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న డీఎస్పీ ఆదినారాయణ.. కాపు సంఘం నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వివరించారు. డీఎస్పీ ప్రకటనతో కాపు సంఘ నేతలు అందోళన విరమించారు.