కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్​హాసన్ - విజయవాడలో మహేశ్ బాబు అభిమానుల సందడి - దేవినేని అవినాష్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 2:08 PM IST

Kamal Hasan Unveiled The Statue Of Krishna: విజయవాడ గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్​తో​ కలిసి ఆయన విగ్రాహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు వారి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని గురునానక్‌ కాలనీలో ఆవిష్కరించడంపై ఆనందంగా ఉందని దేవినేని అవినాష్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయన వారసత్వంతో వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారని అవినాష్ కొనియాడారు. 

ఎప్పుడు సినిమా షూటింగ్​లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం ఎంతో సంతోషకరమన్నారు. కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరఫున నగర ప్రజలు నటుడు కమల్‌హాసన్‌కు, నియోజకవర్గ ఇంచార్జీ దేవినేని అవినాశ్​కు ధన్యవాదాలు తెలిపారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహా ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.