Cheating with Gold Scheme: నమ్మకంగా ఉంటూ.. బంగారం, నగదు తీసుకుని - అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బంగారం వ్యాపారి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-06-2023/640-480-18781928-240-18781928-1687061585172.jpg)
Jeweller fraud in Katrenikona: ఓ బంగారం వ్యాపారి తన తండ్రికి ప్రజలలో ఉన్న నమ్మకాన్ని అదనుగా తీసుకుని మోసానికి తెరలేపాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 60 లక్షల రూపాయల వరకు తమను మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన గ్రామంలో ప్రజలకు నమ్మకంగా ఉంటూ.. గత 30 సంవత్సరాలుగా ఓ వ్యాపారి రామలక్ష్మి గోల్డ్ షాపు పేరుతో నగల దుకాణాన్ని నిర్వహించుకుంటూ వచ్చాడు. అతనికి ఇద్దరు కుమారులున్నారు. వారు కూడా బంగారం వ్యాపారంలో తండ్రికి సహాయం చేస్తూ వచ్చారు. రెండు సంవత్సరాల క్రితం ఆ వ్యాపారి మరణించటంతో.. అతని కుమారుడు శ్రీధర్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొంత మంది శ్రీధర్‌కు పాత బంగారం ఇచ్చి కొత్తగా అభరణాలు తయారు చేయమన్నట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా ఇటివలే గోల్డ్ స్కీం పేరుతో నెలవారి చెల్లింపులతో.. సరిపడ బంగారం తిరిగి ఇస్తానని శ్రీధర్ నగదు కూడా వసూలు చేశాడని వివరించారు. బంగారం, నగదు తమ వద్ద నుంచి తీసుకున్నాడు తప్పా తిరిగి ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వటం లేదని నగదు చెల్లించిన వారంటున్నారు. అంతేకాకుండా ఇటీవలే ఓ బాధితునికి శ్రీధర్ తిరిగి ఇచ్చిన లక్ష 25వేల రూపాయల చెక్కు కూడా చెల్లుబాటు కాలేదని ఆరోపించారు. కూలిపనులు చేసుకుని జీవనం సాగించే తాము.. దాచుకుని మరీ నగల వ్యాపారికి ఇచ్చామని వాపోయారు. న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.