Tadipatri CI Suicide: తాడిపత్రి సీఐ బలవన్మరణం.. - అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
CI Ananda Rao Suicide Issue : అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఇంట్లో అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే సీఐ బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. సీఐ ఉరివేసుకున్న సమయంలో భార్య ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. సీఐ ఆత్మహత్య చేసుకున్నట్లు విషయం తెలిసిన వెంటనే ఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సీఐ మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సీఐ ఆత్మహత్యకు రాజకీయ ఓత్తిళ్లు కారణమా? : ఈ విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం గందరగోళానికి గురిచేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత ఐదు నెలలుగా ఒత్తిడి చేయడం వల్లే సీఐ ఆత్మహత్య చేసుకున్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఏ ప్రాంతంలో లేని విధంగా తాడిపత్రిలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన అన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం రాజకీయ ఒత్తిడి కారణంగా చనిపోయినట్లు నిరూపిస్తే ఏ చర్యకైనా తాను సిద్ధమని అన్నారు. పోలీసులు విచారణ చేసి నిజానిజాలు తేల్చాలని కోరారు.
TAGGED:
CI Ananda Rao Suicide issue