Potina Mahesh: "నవరత్నాల వల్ల.. ఏ ఒక్క సామాన్యుడి జీవితమైనా మారిందా" - Potina Mahesh Speech
🎬 Watch Now: Feature Video
Potina Mahesh Criticized YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం వల్ల ఏ ఒక్క పేద, సామాన్యుడి జీవితమైనా మారిందా అని ప్రశ్నించారు. ఒక్క ఉదాహరణైనా చూపించగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ పథకాలు ప్రచారం కోసమేనని.. పేదల కోసం కాదని ఎద్దేవా చేశారు. అడ్డగోలు నిబంధనలతో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు రద్దు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పెళ్లి కానుక, విదేశి విద్య, సబ్సిడీ రుణాలు, కుల చేతుల వృత్తుల వారికి పనిముట్లు వంటి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకువస్తానని అన్నారని.. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం పట్టిన మాట వాస్తవం కాదా అని తెలిపారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారని.. ఇంతవరకు పది శాతం కూడా పూర్తి చేయలేకపోయారని.. ఇది వైసీపీ అసమర్థత కాదా అని అన్నారు. జనసేన ప్రశ్నలను సవాల్‌గా తీసుకుని వైసీపీ నాయకులు బహిరంగచర్చకు రావాలన్నారు.