Janasena Leaders Protest: సీఎం భూమిపూజ చేసిన ప్రదేశంలో జనసేన కార్యకర్తల మెరుపు ధర్నా.. - ఇంటి నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
🎬 Watch Now: Feature Video
Janasena Leaders Protest at Model Houses: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో పేదలకు ఇచ్చిన సెంట్ స్థలాలలో ఇంటి నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేసిన ప్రాంతంలో జనసేన నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ వెంకటపాలానికి వెళ్లిన కాసేపటికి మోడల్ హౌస్ వద్దకు చేరుకున్న జనసేన నాయకులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హత లేని ప్రాంతంలో పేదలకు స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆర్ 5 జోన్ అంశం న్యాయస్థానాలలో ఉన్న ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరించడం తగదని జనసేన నేతలు సూచించారు.
అంతకుముందు.. జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ఆళ్ల హరిని.. అమరావతి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆందోళనలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరికొందరు జనసేన నేతలను గృహ నిర్బంధం చేశారు.