Janasena Leader Mahesh Fires on Devineni Avinash: 'సైడ్ ఇవ్వలేదని.. ఆటో డ్రైవర్‌పై దాడి చేస్తారా..?' దేవినేని అనుచరులపై జనసేన మండిపాటు - Devineni Avinash
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 3:38 PM IST
Janasena Leader Mahesh Fires on Devineni Avinash: విజయవాడ నగరంలో దేవినేని అవినాష్ అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ విమర్శించారు. నగరంలో అవినాశ్ అనుచర్ల రౌడీయిజం రోజురోజుకు పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ఒక సాధారణ ఆటో డ్రైవర్‌గా పనిచేసే మువ్వల మోహన్.. రోడ్డు మీద వెళ్లే సమయంలో అవకాశం లేక సైడ్ ఇవ్వకపోవడంతో దేవినేని అవినాశ్ అనుచరులు అతడిని విచక్షణారహితంగా మండిపడ్డారు. వాహనానికి సైడ్ ఇవ్వకపోతే కొడతారా అని మహేశ్ ప్రశ్నించారు. ఈ విషయంలో తన కొడుక్కి అండగా వెళ్లిన మోహన్ తల్లి దుర్గారాణిపై కూడా వారు దుర్భాషలాడి.. చెప్పు చూపించారని పోతిన తెలిపారు. దేవినేని అవినాశ్ అనుచరుల నుంచి మోహన్‌కు ప్రాణహాని ఉందని ఆయన తెలిపారు. అవినాశ్ చేస్తున్న రౌడీయిజంపై గతంలో కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశామని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో మోహన్‌కి అండగా ఉండి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని మహేశ్ తెలిపారు.