షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా - Governor News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 6:23 PM IST
Jammu and Kashmir Lieutenant Governor Tour : జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మహరాష్ట్రలో ఉన్న శని శింగనాపూర్ గ్రామంలోని శనిదేవుడుని ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతర షిర్డీ సాయిబాబా సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెుదటగా శనిదేవుడిని దర్శించుకుని ప్రత్యేకంగా శనిదేవుని మహోత్సవం నిర్వహించారు. అనంతరం శని విగ్రహానికి నూనె సమర్పించి దర్శించుకున్నారు. తరువాత శనిదేవస్థానం అధ్యక్షులు భగవత్ బంకర్, ధర్మకర్తలు గవర్నర్ మనోజ్ సిన్హాను శాలువా, శని చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.
శని దర్శనం అనంతరం గవర్నర్ షిర్డీకి బయలు దేరి సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ సాయిబాబా పాద్యపూజ నిర్వహించారు. దర్శనం తరువాత సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివశంకర్ గవర్నర్ సిన్హాకు సాయిబాబా శాలువా, విగ్రహాన్ని అందించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో షిర్డీలో భారీగా పోలీసులు మోహరించారు. అంతేగాక గవర్నర్కు జెడ్ భద్రత కల్పించారు. దీంతో కొంత సేపటికి వరకు భక్తులకు బాబా దర్శనాలను నిలిపివేశారు.