సీఎం జగన్‌ సన్నిహిత కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్​పై ఐటీ రైడ్స్ - రెండో రోజు కొనసాగుతున్న సోదాలు - షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 9:35 AM IST

Updated : Dec 19, 2023, 9:40 AM IST

IT Raids on Shirdi Sai Electricals: వైసీపీ ప్రభుత్వంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్​కు సన్నిహిత కంపెనీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్​పై ఐటీ శాఖ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య తెలంగాణ నుంచి వచ్చిన అధికారులు కడప శివారులోని పారిశ్రామికవాడలో ఉన్న ఆ సంస్థకు చెందిన కర్మాగారం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నిన్న ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.  షిర్డీ సాయి కంపెనీ, కార్యాలయాలు, ఇళ్లలో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో సైతం ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. 

కడపలోని కర్మాగారంలో విద్యుత్తు స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తున్నారు. నగరంలోని రిమ్స్ సమీపంలోని కోట్లాది రూపాయాల విలువైన 52 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ ప్రభుత్వం ఇటీవలే ఈ కంపెనీకి కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే సంస్థ ఆర్థికంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్నుశాఖ సోదాలు చేపట్టింది. తనిఖీల సమయంలో ఐటీ అధికారులు పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కడప నగరంలోని కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి బంధువులకు చెందిన కరుణాకరరెడ్డి చిన్న పిల్లల ఆసుపత్రిలోనూ సోదాలు చేశారు.

Last Updated : Dec 19, 2023, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.