Interview With Bharat Avadhani Sharma: వయసు 17.. 2 శతకాలు, 51 అవధానాలు పూర్తి
🎬 Watch Now: Feature Video
Interview With Bharat Avadhani Sharma : ఆ యువకుడికి చిన్ననాటి నుంచే మాతృభాషపై విపరీతమైన మక్కువ. అదే అతడిని పద్య రచన, అవధానం వైపు నడిపింది. నిండా 20 ఏళ్లు కూడా లేని ఆ యువకుడు.. అప్పుడే 2 శతకాలు రాసేశాడు. 51 అవధానాలు పూర్తిచేసి పలు బిరుదులు కూడా అందుకున్నాడు. మరోవైపు మృదంగ వాద్యకారుడిగానూ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. అలాంటి తెలుగులో అద్భుతంగా అవధానం చేస్తున్నాడు ఆ యువ పండితుడు ఉప్పలధడియం భరత్ శర్మ. పద్య రచనలో ఉన్న సౌరభాన్ని సౌకర్యాన్ని యువతకు తెలియజెప్పడంతో పాటుగా, మన ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవడం, మాతృభాష గొప్పతనం రచనల ద్వారా తెలియజెప్పడం తన లక్ష్యమని చెబుతున్నాడీ యువకుడు. ప్రస్తుతం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాక్ శాస్త్రి (ఇంటర్) పూర్తి చేసి శాస్త్రి (డిగ్రీ)లోకి ప్రవేశం పొందేందుకు అర్హత సాధించాడు. మరి ఆ యువకుడి ప్రస్థానం ఎలా సాగింది. అతిచిన్న వయసులోనే ఇంతటి విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి అనే విషయాలను అతని మాటల్లో తెలుసుకుందాం పందండీ...