TDP, JSP FLEXI: 'ఓరె సాంబ రాస్కోర.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే అమరావతి వస్తుంది.. వచ్చింది హా...' - ఆంధ్ర రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
ఉరుసు ఉత్సవాలకు వచ్చిన వాళ్లని ఓ ప్లెక్సీ ఆకర్షిస్తోంది. సీబీఎన్ ఆర్మీ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్లెక్సీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్లెక్సీని చూసిన వారు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? లేదా? అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆ ప్లెక్సీ ఎందుకు ఆకర్శిస్తోందో మీరు ఓ లుక్కేయండీ బాసూ..
'ఓరె సాంబ రాస్కోర.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిస్తే ఆస్కార్ వచ్చింది. అలాగే చంద్రబాబు పవన్ కల్యాణ్ కలిస్తే అమరావతి వస్తుంది.. వచ్చింది హా...' అనే క్యాప్షన్‌తో ఓ ఫ్లెక్సీ దర్శనమిస్తోంది. ఈ ఫ్లెక్సీని ఉరుసు ఉత్సవాలను వచ్చినవాళ్లు తదేకంగా చూస్తూ ఉండిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసే పోటీ చేస్తే విజయం ఖాయం అని అభిమానులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫ్లెక్సీ ఎక్కడో వెలసిందో చెప్పలేదుగా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో ఉరుసు ఉత్సవాల సందర్భంగా వెలసింది. గతంలో కూడా ఆ పార్టీల కార్యకర్తలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్న ఇటువంటి ప్లెక్సీనే ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే.... రాష్ట్రంలో విజయం ఖాయమనే సందేశాన్ని అగ్రనేతలకు అందించటానికే అభిమానులు ఇలా చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.