పక్కా ఆధారాలతోనే ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేయాలి - బీఎల్వోలకు సూచన
🎬 Watch Now: Feature Video
Inspected the Voter Register election officers : ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. వాటిని పరిశీలించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకు మూడు రోజుల షెడ్యూల్ ఖరారు అయ్యింది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం (నవంబరు 27న ) శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ట గ్రామంలోని 142, 183 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఓటరు జాబితాల్లోని మార్పులు, చేర్పులకు పక్కాగా ఆధారాలు ఉండాలని అన్నారు.
ఓటరు జాబితాలో.. ఒకే ఫోటోతో ఎన్ని ఓట్లు ఉన్నాయన్న వివరాలను బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన వారి ఓట్లు తొలగించేటప్పుడు మరణ ధ్రువపత్రం లేకుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. గ్రామ సభ తీర్మానం, మృతిచెందిన వారి కుటుంబ వాంగ్మూలం తీసుకుంటున్నట్లు సిబ్బంది తెలిపారు. ఓటరు జాబితాను ఎలాంటి తప్పులూ లేకుండా సిద్ధం చేయాలని సూచించారు. ఓటరు జాబితాను పరిశీలన నామమాత్రంగా జరిగిందని విపక్ష నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.