సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు - ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 12:11 PM IST

Indefinite Strike Of Employees Demanding Resolution Of Issues: క్రమబద్దీకరణ, ఉద్యోగ భద్రత వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని అన్ని విభాగాల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ డిమాండ్లపై గతంలోనే (Sarva Shiksha Abhiyan) ప్రాజెక్టు డైరెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. హెచ్​ఆర్ విధానం, ఉద్యోగ భద్రత, డీఏతో పాటు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పేర్కొన్నారు.

పదవీ విరమణ చేసిన వారికి రూ.10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 16 డిమాండ్లతో కూడిన నోటీసును ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చినట్లు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం తెలిపింది. నేటి నుంచి ఎంఈఓ కార్యాలయంలో సీఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లు, కేజీబీవీ ఉపాధ్యాయులు, పీఈటీలు తదితర ఉద్యోగులంతా విధులకు దూరంగా ఉండనున్నారు. ఎస్​ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు మద్ధతిస్తున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.