Illegal Sand Mining in Bapatla: బాపట్లలో అక్రమ ఇసుక క్వారీలు.. టీడీపీ బృందం పరిశీలన.. లారీ డ్రైవర్లు పరారీ - ap latest news
🎬 Watch Now: Feature Video
TDP Leaders Inspecte Illegal Sand Quarries in Vedullapally : బాపట్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తన బినామీలతో కలిసి భారీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. ఇసుక దందాతో వందల కోట్ల ధనాన్ని ఆర్జిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చేపట్టిన చైతన్య రథయాత్రలో భాగంగా వెదుళ్లపల్లిలో వైఎస్సార్సీపీ నేతల ఇసుక క్వారీలను టీడీపీ బృందం పర్యటించింది. వందల ఎకరాల అసైన్డ్, పేదలకు పంపిణీ చేసిన సొసైటీ భూములను కొని.. అందులో జేసీబీల సహాయంతో 50 నుంచి 60 అడుగుల వరకు ఇసుక తవ్వి మూడు జిల్లాలకు సరఫరా చేస్తున్నారని, అక్రమంగా ఇసుక దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్తో స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో టీడీపీ నాయకులు సెల్ఫీలు దిగారు. టీడీపీ నేతలను చూసిన లారీ డ్రైవర్లు అక్కడి నుంచి పరారయ్యారు.