మంగళగిరి క్వారీల్లో అక్రమ తవ్వకాలు - తెలిసీ పట్టించుకోని అధికారులు - Mining
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 1:37 PM IST
Illegal Mining Rampant in Quarries in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలోని గ్రావెల్ క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. మంగళగిరి ఎయిమ్స్ ప్రధాన ద్వారం వద్ద సుమారు వంద లారీలకుపైగా అక్రమంగా గ్రావెల్‌ను తోడేశారు. ఇది వరకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీలో ఉండగానే ఈ తతంగం నడిచింది. ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తదనంతరం కొత్తగా ఇప్పుడు నియోజకవర్గంలో ఓ పెద్ద మనిషి పెత్తనం చెలాయిస్తున్నారు. ఇంకా మంగళగిరిలో తనను ప్రశ్నించే వారు ఉండరని ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు. పార్టీ అనుచరులతో ఎయిమ్స్ తాడేపల్లి మండలం బ్రహ్మానందపురంలో ఉన్న కొండ వద్ద అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
Illegal Mining Guntur District : ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉండగా అప్పటిదాకా ఇష్టం వచ్చినట్లు తవ్వేసి అందినకాడికి దోచుకోవాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్ని చూడటం లేదని విపక్షలు ఆరోపిస్తున్నాయి.