బీచ్‌లో స్నానానికి వెళ్లి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి - మంగినపూడి బీచ్‌లో అఖిల్ మృతదేహం గుర్తింపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 1:45 PM IST
IIIT Student Died After Going for Bath at Beach: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాళ్లపాలెం బీచ్‌లో స్నానానికి దిగిన ఓ విద్యార్థి మృతి చెందాడు. మెరైన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ రోజు ఉదయం స్నానం చేసేందుకు మచిలీపట్నం బీచ్‌లో దిగారు.
Nuzvid IIIT Student Akhil Death Case: కొద్దిసేపటికి పెద్దఎత్తున సముద్రపు అలలు రావడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. గుర్తించిన మెరైన్ పోలీసులు (Marine Police) నలుగురిని రక్షించగలిగారు. సముద్రపు అలలకు తోకల అఖిల్ అనే విద్యార్థి (IIIT Student Akhil Missing in Beach) కొట్టుకుపోయాడు. మెరైన్ పోలీసులు గల్లంతైన అఖిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేసినా అతడి జాడ కనపడలేదు. మెరైన్ ఎస్సై సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పోలీసులు గాలించగా మంగినపూడి బీచ్‌లో అఖిల్ మృతదేహాన్ని (Akhil's Dead Body) లభ్యమైంది. విద్యార్థి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.