ఈదురు గాలులకు విజయనగరంలో వందల ఎకరాల్లో అరటి పంట నష్టం.. దిక్కుతోచని స్థితిలో రైతులు - విజయనగరం జిల్లాలో పంట నష్టం
🎬 Watch Now: Feature Video
Crop Damage due to Strong Winds: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈదురు గాలులకు సుమారు 800 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. చేతికొచ్చిన అరటి పంట ఆకస్మిక గాలులకు నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పంట పెట్టుబడికి లక్షల రూపాయలు అప్పు చేశామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇందులో సాలూరు నియోజకవర్గంలోనే సుమారు 600 ఎకరాలకు పైగా అరటి పంట ఈదురు గాలులకు ధ్వంసం అయింది. అదే విధంగా పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. అప్పు తెచ్చి మరీ కౌలు చేస్తున్నామని.. ప్రస్తుతం ఇలా ఈదురు గాలుల వలన పంట నష్ట పోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. చేతికొచ్చే సమయంలో పంట నష్ట పోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నష్ట పోయిన పంటను పరిశీలించిన టీడీపీ నేతలు.. వెంటనే ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం ఇవ్వలని.. రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.