Huge Gold Theft In Manappuram Gold Loan Company : మణప్పురం బ్రాంచ్‌లో ఉద్యోగుల చేతివాటం.. రూ.కోట్ల విలువైన బంగారం మాయం - gold theft in kankipadu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2023, 4:04 PM IST
Huge Gold Theft In Manappuram Gold Loan Compeny in krishna District : కృష్ణా జిల్లాలోని మణప్పురం గోల్డ్‌లోన్ కంపెనీలో రూ. కోట్లు విలువ చేసే బంగారం చోరీ జరిగింది. మొత్తం 16 కిలోల బంగారం తాకట్టులో ఉండగా.. ఇద్దరు ఉద్యోగులు 10కేజీలతో పరారయ్యారు. వారిలో ఒకరు ఇప్పటికే పోలీసు ఆధీనంలో ఉండగా.. అసలు నిందితురాలి ఆచూకీ తెలియాల్సి ఉంది.
Valuble Gold Theft By Employee In Gold Loan Compeny 2023 : కంకిపాడు మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి బ్రాంచ్ కార్యాలయంలోని బంగారం చోరీ చేసి పరారైంది. బ్రాంచ్ కార్యాలయంలోని ఆరు కోట్ల విలువైన బంగారాన్ని అందులోనే పని చేస్తున్న ఉద్యోగి పావని మరో వ్యక్తితో కలిసి దొంగతనం చేసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలుపుతూ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఖాతాదారుల రికార్డులను పరిశీలించిన ఉద్యోగులు సుమారు 11 కిలోల బంగారం చోరీ అయినట్టు గుర్తించి నివేదిక తయారు చేశారు. కంపెనీ ఉద్యోగులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితురాలు పావని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.