గోదావరిలో ఇసుక తవ్వకాలకు బ్రేక్ - హైకోర్టు ఉత్తర్వులు 'అధికారులపై చర్యలు' - ఏపీ హైకోర్టు లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 10:40 AM IST

High Court on Sand Mining at Godavari River: గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపంలో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఇసుక తవ్వకాలను నిలువరిండంతో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 

HC Orders to Stop Sand Mining in Godavari River: జయప్రకాశ్ పవర్‌ వెంచర్‌ లిమిటెడ్(Jayaprakash Power Venture Limited), ట్రంకీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌(Trunki Enterprises Private Limited) సంస్థలు భారీ యంత్రాలను వినియోగించి ఇసుకను విచక్షణారహితంగా తవ్వుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో జి.వంశీ దినేష్‌రెడ్డి పిల్(Vamshi Dinesh Reddy Pill in HC on Sand Mining) వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. తవ్వకాలను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.