వారంలోగా తేల్చండి లేదంటే మేమే ఆర్డర్ పాస్ చేస్తాం : రాజధాని రైతుల పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు - amaravati farmers lease payment issue
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 7:11 PM IST
|Updated : Nov 28, 2023, 6:28 AM IST
High Court on Capital Amaravati Farmers Petition: కౌలు చెల్లించాలంటూ రాజధాని అమరావతి రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తమకు వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ చింతా రామ్మోహన్‌తో పాటు మరికొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. సీఆర్డీఏ కమిషనర్ ఇటీవల ఎన్నికల విధులు ముగించుకుని వచ్చారని.. మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అడిషనల్ కమిషనర్ ఉన్నారని.. ఫైనాన్స్ సెక్రటరీ, మున్సిపల్ సెక్రటరీ వీటిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. కాబట్టి మూడు వారాల సమయం అవసరం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం.. వారంలోగా రిప్లై ఇవ్వాలని లేకుంటే తామే ఆర్డర్ పాస్ చేస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా సమితి, సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్లతో జత చేసి.. ఈ పిటిషన్‌ను కూడా విచారించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
TAGGED:
రాజధాని రైతుల కౌలు పిటిషన్