'అంగన్వాడీల సమ్మెతో పౌష్టికాహారం వృథా అవుతోంది' - హైకోర్టు అత్యవసర విచారణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 3:28 PM IST
|Updated : Jan 11, 2024, 3:52 PM IST
AP High Court Hearing on Petition Filed Against Anganwadi Strike: అంగన్వాడీల సమ్మెతో రాష్ట్రంలో గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందకుండా పోతుందని పేర్కొంటూ న్యాయవాది ఉషారాణి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ సమ్మెను విరమింపజేసే విషయంలో చర్చలు నిర్వహిస్తున్నామన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు.
అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 31 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని రోజులుగా వివిధ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని దీంతో పౌష్టికాహారం వృథా అవుతోందని న్యాయవాది సుధాకర్ అన్నారు.