పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న సునీత, సీబీఐ- పిటిషన్లకు అనుమతిచ్చిన హైకోర్టు - High Court news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 10:24 PM IST
High Court Allows Viveka Daughter, CBI Petitions: మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌లు వేసిన సవరణ పిటిషన్లకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) అనుమతి ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లు రద్దు చేయాలని కోరుతూ వేసిన సవరణ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రధాన వ్యాజ్యంపై ఈ నెల 10వ తేదీ విచారణ జరుపుతామని తెలియజేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
అసలు ఏం జరిగిందంటే: పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఇటీవలే వివేకానందరెడ్డి కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌లు వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. తమపై అన్యాయంగా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సవరణ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం వివేకా కుమార్తె, సీబీఐ ఎస్పీ వేసిన సవరణ పిటిషన్లకు అనుమతి ఇచ్చింది. ప్రధాన వ్యాజ్యంపై ఈ నెల 10వ తేదీన విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.