Governor Visited Kanaka Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కనులపండువగా దసరా సంబరాలు .. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న గవర్నర్
🎬 Watch Now: Feature Video
Governor Justice Abdul Nazeer visited kanaka Durgamma : ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా ఇవాళ బాలాత్రిపురసుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలి దర్శనం చేసుకున్నారు. గవర్నర్‌కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
రెండు సాధారణ క్యూ లైన్లు, 100, 300, 500 రూపాయల టికెట్టు లైన్లలో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉత్సవాల మొదటి రోజు కలశ స్థాపన, స్నపనాభిషేకం అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు నవరాత్రుల మొదటి రోజు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Dussehra Celebration Navaratri Celebrations 2023 at Indrakeeladri vijayawada : ఇంద్రకీలాద్రిపై దశమి శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ... భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణలు, మార్పుల గురించి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పండితులు యనమండ్ర ఉమాకాంతశర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి.