అంగన్వాడీతో ప్రభుత్వం మళ్లీ చర్చలు - ఆ రెండు డిమాండ్లపై కార్యకర్తల పట్టు
🎬 Watch Now: Feature Video
Government Talks With Anganwadi Associations : రాష్టంలో అంగన్వాడీల సమ్మె గత 15 రోజులుగా కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సమ్మె మోత వినిపించేలా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తించారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరుపనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంత్రుల బృందంతో చర్చలకు రావాలంటూ అంగన్వాడీ సంఘాలను ఆహ్వానించింది. అలాగే సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాలంటూ ప్రభుత్వం సమాచారం పంపింది.
Anganwadi Associations Protest Against CM Jagan in AP : అంగన్వాడీలు సమ్మె విరమించాలంటూ ఇప్పటికే పలు దఫాలుగా మంత్రులు చర్చలు జరిపినా విఫలం కావటంతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచినట్టు ప్రభుత్వం స్పష్టం చేసినా ప్రధాన డిమాండ్‌గా ఉన్న వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై అంగన్వాడీలు పోరాడుతున్నారు. ఈ చర్చల్లోనైనా హామీలు నెరవేరుతాయో లేదోనని అంగన్వాడీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.