Goods Train Hits Car in Visakha: విశాఖ రైల్వే లూప్‌లైన్‌లో కారును ఢీకొన్న గూడ్స్.. ప్రయాణికులు సేఫ్ - విశాఖ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2023/640-480-19220251-564-19220251-1691566746919.jpg)
Goods Train Hits Car in Visakha: విశాఖ-షీలా నగర్ పోర్ట్ రోడ్డు మారుతి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం తప్పింది. పోర్టు నుంచి స్థానిక వేర్ హౌజ్‌లకు వెళ్లే రైల్వే లూప్ లైన్‌పై గూడ్స్ రైలు.. కారును ఢీకొట్టింది. స్థానిక శ్రీహరిపురం నుంచి విశాఖ సిటీకి నలుగురు కుటుంబ సభ్యులు కారులో వెళ్లే క్రమంలో.. రైల్వే లైన్‌ను క్రాస్ చేస్తుండగా.. ట్రాక్ మధ్యలో కారు ఆగిపోయింది. అదే సమయంలో ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ ట్రైన్‌ను లోకో పైలెట్ స్లో చేశాడు. దీంతో రైలు.. కారును ఢీకొట్టేలోపు వాహనంలోని ప్రయాణికులు డోర్లు తెరచి బయటకు దూకి వచ్చేశారు. వారు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో బాధితులు రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబంగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.