బంగారం మాయం కేసులో వీడిన మిస్టరీ - బ్యాంకు సిబ్బందే దోషులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 10:26 PM IST
Gold Robbery Mystery Reveal in Police Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలోని గార స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడు కేజీల బంగారు ఆభరణాలు మాయం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బ్యాంకులో పని చేస్తున్న స్వప్నప్రియ, సురేష్, మరికొందరు ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బ్యాంకు సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహరమంతా దాదాపు సంవత్సరం నుంచి జరుగుతుందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు పూర్తి వివరాలు జిల్లా ఎస్సీ రాధిక మీడియాకు తెలియజేశారు.
స్వప్నప్రియ, సురేష్ ఇద్దరు కలిసి బ్యాంకులో ఖాతాదారులు ఉంచిన బంగారాన్ని దొంగతనంగా తీసి తిరుమలరావుకు ఇచ్చేవారని ఆమె తెలిపారు. ప్రైవేేటు ఏజెన్సీస్ల ద్వారా తిరుమలరావు వివిధ బినామీ పేర్ల మీద బ్యాంకు నుంచి తెచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టేవాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన బ్యాంకు ఉద్యోగి స్వప్నప్రియ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించగా మరో ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు బ్యాంకు ఉద్యోగైన సురేశ్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.