Godavari Flood: గోదావరిలో పెరిగిన నీటిమట్టం.. లంక గ్రామాల కోసం బోట్లు సిద్ధం - Godavari news
🎬 Watch Now: Feature Video
Godavari water level has increased: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి గోదావరి నీటి మట్టం అమాంతంగా పెరిగింది. ఈ వర్షాలతో పాటు గోదావరికి వరద నీరు తగలడంతో ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఉన్న కోనసీమలోని వశిష్ట, వైనితేయ, గౌతమీ గోదావరి నది పాయల్లోకి వరద నీరు చేరి క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. ఈ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల పైబడి వరద నీటిని విడిచిపెట్టారు. అలానే రానున్న మరో రెండు రోజుల్లో వరద నీరు 5 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక వర్షాల వల్ల వరద నీరు పెరుగుతున్న క్రమంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఆలమూరు, కపిలేశ్వరపురం తదితర మండలాల్లోని లంక గ్రామాల ప్రయోజనం కోసం 8 బోట్లు సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా వెల్లడించారు.