అధికార పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు - అభ్యంతరం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్

🎬 Watch Now: Feature Video

thumbnail

Former State EC Commissioner Nimmagadda Ramesh Kumar: ఓటు హక్కుని కాపాడుకునేందుకు అందరూ కలిసి పోరాడితేనే అడ్డగోలు ఫాం-7 దరఖాస్తులకు అడ్డుకట్ట పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్వ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అడ్డగోలుగా వచ్చే ఫాం-7 దరఖాస్తులను ఆమోదించి ఓట్లు తొలగిస్తే అధికారులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ దరఖాస్తులను పరిశీలించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా తమ ఓటు హక్కును కోల్పోతే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుని మళ్లీ ఓటు హక్కును పొందే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఫాం-7 దరఖాస్తుకు పరిమితులు ఉన్నాయని వెల్లడించారు.  రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో మా ప్రతినిధి చంద్రశేఖర్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.