Ex MP Murali Mohan Solidarity to Nara Bhuvaneswari నారా భువనేశ్వరిని కలిసిన మాజీ ఎంపీ మురళీమోహన్‌.. "చంద్రబాబు ఏ నేరం చేశారని జైలులో పెట్టారు" - Skill development scam

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 6:37 PM IST

Former MP Murali Mohan Solidarity to Nara Bhuvaneswari : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును (Chandrababu Arrest) వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రముఖులు, అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరి సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ నారా భువనేశ్వరిని కలిశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గ్రహణం వీడి త్వరలోనే బయటకు వస్తారని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ నేరం చేశారని జైలులో పెట్టారని ఆయన ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఎంతో శ్రమించి ఐటీ, పరిశ్రమలు స్థాపించారని ఆయన గుర్తు చేశారు. కనీస వసతులు లేకుండా చంద్రబాబును ఖైదీల మధ్య జైలులో ఉంచటం బాధాకరమని, కనీస వసతులు లేవని ఆయన అన్నారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరిని కలిసి మురళీ మోహన్‌ మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.