అధికార పార్టీ వాహనాలు నంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్నా పట్టించుకోరా ! - జేసీ ప్రభాకర్​ ఆందోళన - tadipatri update news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 4:56 PM IST

Former MLA JC Prabhakar's Protest : అధికార పార్టీకి చెందిన వాహనాలకు నంబర్​ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నా పట్టించుకోరా అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్​ రెడ్డి ఆందోళన నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మోటార్​ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. పట్టణంలో ఎనిమిది కార్లు నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వాహనాలన్నీ అధికార వైసీపీకి చెందినవారివేనని ఆరోపించారు.

JC Demand to Fix Number Plates on Cars : తన ఇంటి చుట్టూ నంబరు ప్లేట్​ లేని వాహనాలు చక్కర్లు కొడుతున్నాయని జేసీ ప్రభాకర్​ అధికారులకు వివరించారు. నిరసనకు దిగిన జేసీకి ఆర్టీఏ అధికారులు నచ్చే చెప్పే ప్రయత్నం చేశారు. కార్లకు వెంటనే నంబరు ప్లేట్లు బిగించాలని డిమాండ్​ చేశారు. వారం రోజుల్లో నంబరు ప్లేట్​ లేని వాహనాలను గుర్తించి, తప్పనిసరిగా బిగిస్తామని జేసీకి అధికారులు హామీ ఇవ్వడం వల్ల ఆయన నిరసన విరమించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.