Sundara Tirumala: శుద్ధ తిరుమల-సుందర తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ సీజే - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2023, 11:35 AM IST

Updated : May 13, 2023, 1:15 PM IST

Former CJI Justice NV Ramana at Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 13 రోజులుగా తిరుమల శుభ్రత కోసం "శుద్ధ తిరుమల - సుందర తిరుమల" నిర్వహించడం సంతోషకరమని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. టీటీడీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో సామూహికంగా చేపట్టిన శుద్ధ తిరుమల - సుందర తిరుమల కార్యక్రమాన్ని అలిపిరి వద్ద ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్‍ వెంకటరమణా రెడ్డితో కలిసి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు, రెండు నడకదారుల్లో ఉద్యోగులతో సామూహికంగా ఈ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. శుద్ధ తిరుమల - సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు  కూడా భాగస్వాములై తిరుమలను సుందరంగా మార్చాలని జస్టిస్‍ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సామూహిక శ్రమదానంలో టీటీడీ ఉద్యోగులతోపాటు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌, తిరుపతి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, న్యాయశాఖ అధికారులు స్వచ్ఛందంగా పాల్గొననున్నారు.

Last Updated : May 13, 2023, 1:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.