లక్షలాదిగా తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు - విజయోత్సవ సభలో ఏర్పాట్లపై ప్రశంసల జల్లు - ఏపీ రాజకీయ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 4:37 PM IST

Food Facilities at Yuvagalam Vijayotsava Sabha: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు విజయనగరం జిల్లాలోని పోలిపల్లి వేదికైంది. విజయోత్సవ సభలో 6 లక్షలు మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. విజయోత్సవ సభ ద్వారా టీడీపీ 2024 ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ సభకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టీడీపీ, జనసేన శ్రేణులు హాజరుకానున్నారు. 

Yuvagalam Success Meet Arrangements: ఈ నేపథ్యంలో భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఏర్పాటైన సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వచ్చినవారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. రుచికరమైన భోజనం, నీళ్లు, మజ్జిగ, కూర్చోవడానికి అవసరమైన సదుపాయం కల్పించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.