Ranganayaka Swamy Gundam: విస్తారంగా వర్షాలు.. రంగనాయకస్వామి గుండానికి పోటెత్తిన వరద.. - Heavy rains in the state

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2023, 7:28 PM IST

Updated : Jul 26, 2023, 8:55 PM IST

Flood Water go to Sri Nemaligundla Ranganayaka Swamy Gundam : మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, వాగులు, వంగలు జలకళను సంతరించుకున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి నీరు భారీగా చేరుతోంది. ఈ సందర్భంలో పర్యాటకుల తాకిడి ఉంటుందని భావించిన అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద నీరు పోటెత్తింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగింది. బుధవారం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో గుండం జలకళను సంతరించుకుంది. గుండ్లకమ్మ వాగుకు ఈ నీరంతా తరలి వెళ్తుంది. గుండానికి వరద నీరు పోటెత్తడంతో ఎవరూ గుండంలోకి ఈతకు వెళ్లకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Last Updated : Jul 26, 2023, 8:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.