Flood to Vamsadhara River: వంశధార నదికి భారీగా పెరిగిన వరద.. లోతట్టు గ్రామాలకు ప్రమాద హెచ్చరిక - Overflowing streams in Srikakulam district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 8:28 PM IST
Vamsadhara River Flood Flow in Srikakulam: గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వేల ఎకరాల్లోని పంట జలమయం అయింది. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో రైతులు ఉన్నారు. ఈ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్న వంశధార నదిలో వరద నీటి ప్రభావం భారీగా పెరిగింది. గురువారం సాయంత్రం సమయానికి 74 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది.. దీంతో వంశధార అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొత్తూరు మండలంలోని లోతట్టు తీర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10 వేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. నివగాం, మదనాపురం, మాతల, మాకవరం రహదారులపైకి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రెండు ప్రోక్లైన్లు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి.