విశాఖలో పలు విమానాలు రద్దు - వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు - విశాఖ ఫ్లైట్స్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 10:22 PM IST
Flights canceled due to bad weather in Visakha: విశాఖ ఎయిర్ పోర్ట్కు రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు వల్ల 6 సర్వీసులు రద్దు అయినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబయిల నుంచి విశాఖ దిగే పరిస్థితి లేక విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పండుగ సమయంలో విమానాలను రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితి సరిగా లేదని విమానయాన సంస్థల ప్రతినిధులు ప్రయాణికులను సముదాయించే ప్రయత్న చేస్తున్నప్పటికీ, ప్రయాణికులు వినిపించుకోవడం లేదు. అర్ధంతరంగా విమాన సర్వీస్లు రద్దు చేశారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
తాము పండగ కోసం అంటూ ముందస్తుగా టికెట్ బుక్ చేసుకున్నామని ప్రయాణికులు తెలిపారు. తీరా స్వస్థలాలకు వెళ్లే సమయంలో విమాన సర్వీసులు రద్దు అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫలంగా విమాన సర్వీసులు రద్దవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మెుత్తంగా విజయవాడ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు విశాఖ నుంచి వెళ్లేవి, విశాఖకు వచ్చేవి రద్దయ్యినట్లు విమానయాన అధికారులు పేర్కొన్నారు.