ఈ చేప ఒక్కటి చిక్కినా లైఫ్ సెటిల్! 27కిలోల చేప ఎంత ధర పలికిందో తెలుసా? - అనకాపల్లి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 9:22 AM IST
|Updated : Nov 28, 2023, 12:40 PM IST
Fisherman Caught Rare Golden Fish in Anakapalli District: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడికమడక మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో వారికి అరుదైన గోల్డెన్ ఫిష్ చిక్కింది. మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ఈ చేప.. ఎవరూ ఊహించని ధర పలికింది. దీంతో మత్స్యకారుల కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. గోల్డెన్ ఫిష్(Golden Fish)గా పిలిచే ఈ అరుదైన కచిడి చేపను కొనుగోలు చేసేందుకు.. 'మేం కొంటాం అంటే మేం కొంటాం' అంటూ స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. చివరకు పూడిమడకకు చెందిన మేరుగు కొండయ్య అనే ఓ వ్యాపారి దీన్ని 3.90 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు.
Kachidi Fish: సముద్రపు బంగారంగా పిలుచుకునే ఈ చేప రుచి ఒక్కసారి చూస్తే చాలు.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందని అంటున్నారు స్థానికులు. ఈ చేప 27 కేజీల బరువు ఉందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య తెలిపారు. ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు కూడా ఉంటాయన్నారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని, మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారని మత్స్యకారులు పేర్కొన్నారు. అందువల్ల అన్ని చేపలకంటే దీనికి అధిక డిమాండ్ ఉంటుంది.