Fire Accident: పలాసలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోటిన్నర నష్టం.. - శ్రీకాకుళం లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Palasa Fire Accident: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భగవతి థియేటర్ రోడ్డులోని మూడు దుకాణాల్లో ఈ మంటలు భారీగా చెలరేగాయి. మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగి.. అనంతరం పక్కనే ఉన్న మరో రెండు దుకాణాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. రెండు దుకాణాల మధ్యలో కేవలం ప్లైవుడ్ ఉండటంతో బైక్ షోరూం నుంచి వచ్చిన మంటలు హార్డ్ వేర్ దుకాణంలోకి వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎలక్ట్రిక్ బైక్ దుకాణం, హార్డ్‌వేర్ షాప్, మద్యం దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 100 పాత, కొత్త బైక్లు దగ్ధమైనట్లు యజమానులు తెలిపారు. వీటితో పాటు మద్యం దుకాణం, హార్డ్‌వేర్ షాప్లోనూ సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు కోటిన్నర రూపాయల నష్టం జరిగి ఉంటుందని.. అంచనా వేస్తున్నారు. మంటలు ఎలా చెలరేగాయి అనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే తెల్లవారుజామున ఆ ప్రాంతంలో పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. వెంటనే ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.